- Advertisement -
హైదరాబాద్: బుధవారం(అక్టోబర్ 2) నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. అన్ని పాఠశాలలు అకడమిక్ క్యాలెండర్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. పాటించని స్కూళ్లపై చర్యలుంటాయన్న హెచ్చరించింది. అయితే, ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6 నుంచి సెలవులు ఇవ్వనున్నారు. బతుకమ్మ, దసరా చాలా ముఖ్యమైన పండుగలు అని, అందరికీ ఒకేలా సెలవులు ఇవ్వాలని డిమాండ్ ఇంటర్ పలు లెక్చరర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు ఏపీలో స్కూళ్లకు, కాలేజీలకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. గాంధీ జయంతి కావడంతో ఈరోజు కూడా హాలిడేనే.
- Advertisement -