Thursday, January 16, 2025

ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 12వ తేదీ వరకూ రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగుబంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలి వస్తుండడంతో ఆలయం, పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు.

ఈ ఉత్సవాల్లో నిత్యం లక్షకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారని అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా దాదాపు నాలుగున్నర వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరో వైపు ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకుచ్చారు.

అమ్మవారికి బంగారు వజ్ర కిరీటం సమర్పణ : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారికి అలంకరణ నిమిత్తం పీనేన్స్ కమర్శియల్ ప్రై లిమిటెడ్, ఆర్ ఓ సి, ముంబై కి చెందిన సౌరబ్ బోరా 1817 గ్రాముల బరువు కలిగిన బంగారు వజ్ర కిరీటం ను, విష్ణు మేడోస్, బంజారా హిల్స్, హైదరాబాద్ కు చెందిన సి ఎం రాజేష్ 210 గ్రాముల బంగారు డైమండ్ సూర్యుడు (సూర్యబింబం), చంద్రబింబం(207 గ్రాములు), ఏమిరాల్ ఫర్నిచర్, కొండాపూర్, హైదరాబాద్ కు చెందిన హైమావతి సూర్య కుమారి వజ్ర బొట్టు, వజ్ర నత్తు వజ్రపు బులాకి మొత్తం 33 గ్రాముల బరువు లను పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కె ఎస్ రామరావు చేతుల మీదుగా దేవస్థానం నకు అందజేశారు. దాత కు వీరు అమ్మవారి దర్శనం కల్పించగా బాలత్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోగా వేదపండితులచే వేదార్వచనం కల్పించి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News