Monday, December 23, 2024

సస్పెన్స్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Duster 1212 movie

హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితంలో జరిగి న యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రమే ‘డస్టర్ 1212’. శుభకరి క్రియేషన్స్, వి.యస్.ఆర్ మూవీస్ బ్యానర్స్‌పై అథర్వా, మిష్టి, అనైకా సోటి నటీనటులుగా బద్రీ వెంకటేష్ దర్శకత్వంలో విద్యాసాగర్, విసినిగిరి శ్రీనివాస రావులు సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, నిర్మాత యం. సూర్యనారాయణ రెడ్డి, దర్శకుడు శ్రీకాంత్, నటుడు కాదంబరి కిరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడు తూ “ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. మార్చి 4న థి యేటర్స్‌లో విడుదలవుతున్న ఈ చిత్రం విజయాన్ని సా ధించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. చిత్ర ని ర్మాత విసనగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ “సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఉన్న ఈ కథ నచ్చడంతో మేము వినయ్ తో కలిసి ‘డస్టర్ 1212’ సినిమా తీశాము. ఫ్యామిలీ అం దరూ కలసి చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము”అని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రినాథరావుతో పా టు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News