Friday, November 22, 2024

వీర్యదానంతో 550 మంది పిల్లలకు తండ్రయ్యాడు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: అన్ని దానాలలోకెల్లా వీర్యదానమే గొప్పదని భావిస్తున్నాడు ఆ డచ్ జాతీయుడు. నెదర్లాండ్స్‌కు చెందిన జోనాతన్ మీజర్ అనే వ్యక్తి తన వీర్యదానంతో 550 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అయితే చట్ట వ్యతిరేకంగా ఇంత భారీ సంఖ్యలో పిల్లల పుట్టుకకు కారకుడైన జోనాతన్‌పై నెదర్లాండ్స్‌లోని హేగ్ జిల్లా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. వీర్యాన్ని దానం చేయకుండా అతడిపై నిషేధాన్ని విధించింది. ఏదైనా ఫెర్టిలిటీ సెంటర్‌కు వీర్యాన్ని దానం చేసినట్లయితే దాన్ని నాశనం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. డచ్ చట్టాల ప్రకారం వీర్య దాతలు గరిష్ఠంగా 12 మంది తల్లులకు 25 మంది సంతానోత్సత్తి కోసం వీర్యాన్ని దానం చేయవచ్చు. అంతకుమించి వీర్య దానం చట్ట వ్యతిరేకం.

కాని జోనాతన్ ఇప్పటికే 550 మంది పిల్లలను తన వీర్యదానం ద్వారా తండ్రయ్యాడు. మరింత మంది పిల్లల కోసం వీర్యదానం చేయడానికి తాను సిద్ధమేనంటున్నాడు. జోనాతన్‌పై డచ్ డోనార్ చైల్డ్ ఫౌండేషన్ కేసు పెట్టింది. అతని వీర్యదానంతో జన్మించిన పిల్లలలో మానసిక పరిస్థితి బాగాలేదని ఫౌండేషన్ తెలిపింది. ఈ కేసును విచారించిన హేగ్ జిల్లా కోర్టు ఫౌండేషన్ వాదనతో ఏవీభవించింది. పిల్లలలో మానసిక స్థితి దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. జోనాతన్ ఇకపై ఎవరికీ వీర్యదానం చేయకూడదని కోర్టు నిషేధం విధించింది. అంతేకాక ఇప్పటికే ఏ ఫెర్టిలిటి సెంటర్‌కైనా వీర్యాన్ని దానం చేసి ఉంటే దాన్ని నాశనం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News