- Advertisement -
ది హేగ్ ( నెదర్లాండ్స్): నెదర్లాండ్ లోని సంకీర్ణ డచ్ ప్రభుత్వం కుప్పకూలడంతో ప్రధాని మార్క్ రుట్టే తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజు విల్లెమ్ అలెగ్జాండర్‌కు శనివారం సమర్పించారు. గ్రీస్‌లో కుటుంబ విహారయాత్రలో ఉన్న రాజు విల్లెమ్ అలెగ్జాండర్ తిరిగి శనివారం రుట్టేను కలియడానికి రాగా, రుట్టే ఆయనకు తన రాజీనామా లేఖ అందజేశారు.
వలసల సమస్య పరిష్కారంలో వైఫల్యం నెదర్లాండ్‌ను రాజకీయ సంక్షోభం లోకి నెట్టడంతో చివరకు ప్రధాని పదవికి రుట్టే రాజీనామా చేయవలసి వచ్చింది. శుక్రవారం రాత్రి రుట్టే ప్రభుత్వం కుప్పకూలింది. గత ఏడాది జనవరిలో రుట్టే ప్రభుత్వం అధికారం చేపట్టింది. అయితే వలసలను నియంత్రించే విధానంపై అంగీకారం కుదరక 18 నెలల్లోనే సంకీర్ణ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. పర్యవసానంగా ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి.
- Advertisement -