Sunday, December 22, 2024

రాజకీయాల నుంచి తప్పుకుంటా : డచ్ ప్రధాని మార్క్ రుట్టే

- Advertisement -
- Advertisement -

ది హేగ్ : తన ప్రభుత్వం రాజీనామా తో వచ్చే సాధారణ ఎన్నికల తరువాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని డచ్ ప్రధాని మార్క్ రుట్టే సోమవారం వెల్లడించారు. పీపుల్స్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ అండ్ డెమొక్రసీ లేదా వివిడి నాయకుడైన 56 ఏళ్ల రుట్టే తన సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలిన తరువాత హడావిడిగా ఏర్పాటుచేసిన పార్లమెంట్ సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నిన్ననే తానీ నిర్ణయం తీసుకున్నానని,

వివిడి నాయకునిగా ఇక తాను అందుబాటులో ఉండబోనని ఆయన వివరించారు. ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాక తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని చెప్పారు. అయితే ఎన్నికలకు ఇంకా తేదీ ప్రకటన కాలేదు. కానీ అక్టోబర్ లేదా నవంబర్ కన్నా ముందు ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News