Monday, December 23, 2024

అంకిత భావంతో విధులు నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

కోస్గి: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధినిర్వహణలో పోలీస్ అధికారులు,సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని నారాయణపేట్ డిఎస్పీ సత్యనారాయణ అన్నారు.శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా డిఎస్పీ సత్యనారాయణ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి ప్రతినెలా రివార్డులు,అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.వర్టికల్ వారీగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలను తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని అన్నారు.

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవరించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు.రౌడీలు,కేడీలు,సస్పెక్ట్,సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి,వారి కదలికలను గమనించాలని అన్నారు.రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని అన్నారు.విధి నిర్వహణలో రోల్‌క్లారిటీ,గోల్ క్లారటీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలని అన్నారు.

గ్రామ విలేజ్ పోలీస్ అధికారులు సంబంధిత గ్రామాలను సందర్శించి ప్రజలకు ఉన్న సమస్యలపై ఆరా తీయాలన్నారు.సైబర్ నేరాల గురించి,సిఈఐఆర్ నూతన అప్లికేషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు.పోలీస్‌స్టేషన్‌లో రికార్డ్,సిడి ఫైల్స్‌లో ఇన్వెస్టిగేషన్ ఎస్‌ఒపి ప్రకారం క్రమ పద్ధతిలో ఉన్నందున ఎస్‌ఐ శ్రీనివాసులు,సిబ్బందిని అభినందించారు.అనంతముందు సిబ్బంది పరేడ్‌ను,స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు.కార్యక్రమంలో కోస్గి సిఐ జనార్థన్,ఎస్‌ఐలు శ్రీనివాసులు,నరేష్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News