Sunday, December 29, 2024

వైసిపితోనే ఉంటా: దుట్టా

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపికి తాను ఎప్పుడు విధేయుడిగానే ఉంటానని వైసిపి నేత దుట్టా రామచంద్ర రావు తెలిపారు. గురువారం దుట్టా మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్‌ను విమర్శించినట్టు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ తాను, తన కుటుంబం వైఎస్‌ఆర్‌సిపితోనే ఉంటానని వివరించారు. తనకు పదవులున్నా లేకపోయినా వైఎస్‌ఆర్‌సిపిలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను వైసిపి ఎంఎల్‌ఎ వంశీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నిన్నటి సంభాషణ యాధృచ్చికంగా మాత్రమే జరిగిందని దుట్టా వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News