Sunday, January 19, 2025

పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీల విమర్శలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ టివి ఛానెల్ డిబేట్ లో ఏపి ఎంఎల్ సి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీలు ఏపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ వారు తమ బంధంపై అభ్యంతరకర కామెంట్లు పెడుతున్నారని, తిడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పెళ్లికి ముందే మూడో భార్య అన్నా లెజినోవాను తల్లిని చేయలేదా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యవహారం అతడి వ్యక్తిగతమైనప్పుడు, తమ వ్యవహారం కూడా వ్యక్తిగతమేనన్న సంగతి జనసేన పార్టీ వారు గుర్తుంచుకోవాలన్నారు.

ఇదివరలో కూడా ఓ టివి ఛానెల్ లో మాట్లాడినప్పుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పదవిలో ఉండే అర్హత లేదని దువ్వాడ, దివ్వెల మాధురి అన్నారు. పవన్ చేస్తే ఒప్పు…మేము  చేస్తే తప్పా?అని దువ్వాడ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News