Friday, December 27, 2024

దువ్వాడ శ్రీనివాస్ మామూలోడు కాదండి బాబు!

- Advertisement -
- Advertisement -

టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా నేత, ఎంఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో కొత్త విషయం వెలుగు చూసింది. శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి కారు పలాస లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటనను దువ్వాడ శ్రీనివాస్ తాను కోరుకున్నరీతిలో మలుచుకునేందుకు ప్రయత్నించాడు.

దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని మాధురితో చెప్పించే ప్రయత్నం చేశాడు. మాధురిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమెతో శ్రీనివాస్ మాట్లాడిన రికార్డు ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.

ఫోన్ సంభాషణలో దివ్వెల మాధురి బాగోగులు అడిగి తెలుసుకున్నాక, ‘‘కావాలనే కారుతో ఢీకొట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, వాణి నాలుగు రోజులుగా చేస్తున్న అరాచకాల వల్లే బలవన్మరణానికి ప్రయత్నించినట్లు మీడియాకు చెప్పు….’’ అనడం స్పష్టంగా ఆ ఫోన్ రికార్డులో ఉంది. తన మనుషులను పంపిస్తున్నట్లు, వైద్యులు, పోలీసులతో వ్యవహారం తాను చూసుకుంటానని కూడా శ్రీనివాస్ ఆమెకు భరోసా ఇచ్చాడు. స్వంత భార్య, పిల్లలనే నట్టేట ముంచే రకం అని స్పష్టం అవుతోంది ఆ రికార్డులో.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News