Friday, November 22, 2024

ఈ-సిగరెట్ ప్రమాదమే

- Advertisement -
- Advertisement -

సిగరెట్లు ఆరోగ్యానికి మంచిది కాదని ప్రత్యామ్నాయంగా చాలా మంది ఇప్పుడు వేపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా టీనేజర్లు దీనికి అలవాటు పడుతున్నారు. ఎలెక్ట్రానిక్ సిగరెట్ వంటి వాటి ద్వారా వచ్చే ఆవిరిని పీల్చడాన్ని వేపింగ్ అంటారు. ఈసిగరెట్స్ బ్యాటరీతో పనిచేస్తాయి. మామూలు సిగరెట్లలో పొగాకు నుంచి పొగ వస్తుంది. ఈ సిగరెట్లలో పొగాకు, ఫ్లేవర్స్, కెమికల్స్‌తో నిండిన లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ ని వేడి చేస్తే పొగ/ వేపర్ వస్తుంది. ఈ పొగను పీల్చడమే వేపింగ్. సిగరెట్ల కంటే వేపింగ్ తక్కువ ప్రమాదకారి అయినా, వేపింగ్‌కి అలవాటు పడడం మంచిది కాదు.

స్మోకింగ్‌ని మానడానికి ఒక మెట్టుగా వేపింగ్‌ని వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. వేపింగ్ ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తుంది. ఫ్రీరాడికల్స్‌ని శరీరం లోకి విడుదల చేసి కాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది. పిల్లలు, టీనేజర్లలో మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గర్భిణులు ఈసిగరెట్లు వాడితే అబార్షన్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. జాన్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ ఈ సిగరెట్లపై జరిపిన పరిశోధనలో అనేక విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఈ సిగరెట్లలో ఉన్న వాపింగ్ లిక్విడ్, ఏరోసోల్స్‌లో పూర్తిస్థాయి రసాయనాలను పరిశీలించారు. నికొటిన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నా ఈసిగరెట్ తయారీకి వినియోగించే రసాయనాల్లో ముఖ్యంగా ఆరు హానికరమైన పదార్థాలు ఉన్నట్టు గమనించారు.

ముఖ్యంగా స్టిమ్యులేటెట్ కెఫీన్ ఉన్నట్టు బయటపడింది. ధూమపానం చేసేవారికి అదనపు కిక్ ఇవ్వడానికి కావాలనే కెఫిన్‌ను ఇందులోవాడుతున్నట్టు తెలుసుకున్నారు. ఇంకా మూడు పారిశ్రామిక రసాయనాలు, పురుగుమందులు, విషప్రభావంతో ఉన్న రసాయనాలు, శ్వాసకోశ ఇబ్బందిని కలిగించే రెండు సువాసనలు ఉన్నాయని పరిశోధకులు తెలుసుకున్నారు. ఈవిషయాలను ఉత్పత్తిదారులు బయటకు తెలియనివ్వడం లేదు. దీనివల్ల ఈసిగరెట్లు ఆరోగ్యానికి సురక్షితం అని భావించే వినియోగదారులు ఈ వాస్తవాలను తెలుసుకుని జాగ్రత్త పడడం చాలా మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News