Monday, November 18, 2024

విజయవాడకు 20 నిమిషాలకో బస్సు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నుంచి ఎలక్ట్రికల్ ఎసి గరుడ బస్సులు
నేడు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ
మన తెలంగాణ/హైదరాబాద్: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఎసి బస్సులు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్ టు విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఎసి బస్సులను నడపాలని నిర్ణయించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టీసి) వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతల వారీగా అందుబాటులోకి రానున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపారు.

పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మె రుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ బస్సులకు ‘ఈ-గరుడ’గా సంస్థ నామకరణం చేసింది. హై టెక్ హంగులతో ప్రయాణికులకు వీటిని అందుబాటులోకి తెచ్చామని, ఈ-గరుడ పేరుతో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. మియాపూర్‌లో 10 ఎలక్ట్రిక్ ఎసి బస్సులను టిఎస్ ఆర్టీసి కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్‌లతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించనున్నారు. మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయం త్రం 4:30 గంటలకు ఈ బస్సుల ప్రారంభోత్సవం జరుగనుంది.

కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులు
హైటెక్ హంగులతో ప్రయాణికులకు వీ టిని అందుబాటులోకి తీసుకొచ్చామని, హైదరాబాద్- టు విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఎసి బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. రాబోయే రెండేళ్ల లో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. వాటిలో 1,300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని ఆర్టీసి పేర్కొంది. హైదరాబాద్ లో 10 డబుల్ డెక్కర్ బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఎసి బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జీంగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్ ఏర్పాటు చేశారు. వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టిఎస్ ఆర్టీసి కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News