Wednesday, January 22, 2025

ట్యాంక్‌బండ్‌పై ఈ జెన్- 2 కారు

- Advertisement -
- Advertisement -

E gen2 car on tank bund

ట్యాంక్‌బండ్‌పై నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి…
ఫార్ములా ఇ రేసింగ్ పోటీలపై ప్రజలకు అవగాహన

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన జరిగే ఫార్ములా ఇ రేసింగ్ పోటీలను పురస్కరించుకొని ఈ జెన్ 2 కారును ప్రజల సందర్శనార్ధం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ కారు 3 సెకన్లలోపు 0 నుంచి 62 కి.మీలతో, గంటకు 280 కి.మీల వేగంతో దూసుకెళుతుంది. ఈ కార్ల గరిష్ట వేగం, రేసింగ్ కార్ల మాదిరిగానే ఉంటుందని కానీ, ఇవి ఈవీ సాంకేతికతతో నడుస్తాయని అధికారులు తెలిపారు.

ఇతర మెట్రో నగరాలకు….

స్పోర్ట్స్ అభిమానులను ఆహ్లాదపరిచేందుకు, ఇతరులకు అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 25వ తేదీన ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఈ జెన్ 2 కారు ప్రజల సందర్శనార్ధం డిస్‌ప్లే పెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కారు కొన్ని వారాల పాటు ఇక్కడే ప్రదర్శనలో ఉంచడంతో పాటు రాబోయే నెలల్లో నగరం అంతటా అనేక ఇతర ప్రదేశాల్లో ప్రదర్శించనున్నట్టు అధికారులు తెలిపారు. దీంతోపాటు ఇతర మెట్రో నగరాల్లో ప్రదర్శన నిమిత్తం ఈ కారును తీసుకెళ్లేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

తొమ్మిదో సీజన్ పోటీలకు హైదరాబాద్ వేదిక

ఫార్ములా ఈ రేసింగ్ (ఎలక్ట్రికల్ పవర్డ్ సింగిల్ సీటర్ చాంపియన్‌షిప్) ప్రపంచవ్యాప్తంగా 2014లో ప్రారంభమయ్యింది. ప్రస్తుతం తొమ్మిదో సీజన్ పోటీలకు హైదరాబాద్ వేదికయ్యింది. గతంలో లండన్, న్యూయార్క్, మెక్సికో సిటీ, రోమ్, బెర్లిన్, సియోల్, వాంకోవర్ నగరాలు ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చాయి. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లను ప్రోత్సహించడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. తొమ్మిదో చాంపియన్ షిప్‌లో భాగంగా మొదటిసారిగా జెన్ 2 కార్లను పరిచయం చేయనున్నారు. తేలికైన, వేగవంతమైన, వేగంతో 300 కి.మీల వేగంతో 2.8 సెకన్లలో 0- నుంచి 100 కి.మీల వేగాన్ని అందుకునే కార్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News