తిరువనంతపురం: ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్ ను బిజెపి అధిస్థానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధరన్ తమ పార్టీ సిఎం అభ్యర్థి రేసులో ఉన్నారని బిజెపి కేరళ చీఫ్ కె.సురేంద్రన్ వెల్లడించారు. తర్వలో ఎంఎల్ఎ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని సురేంద్రన్ తెలిపారు. శ్రీధరన్ ఫిబ్రవరిలో చాలా మంది అభిమానుల మధ్య బిజెపిలో చేరారు. అప్పుడే ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచారు. శ్రీధరన్ రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. శ్రీధరన్ కొచ్చి అర్భన్ నియోజకవర్గం నుంచి ఎంఎల్ఎగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. శ్రీధరన్ భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణుడు. మన దేశంలో ప్రజారవాణా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చి ”మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా”గా పిలవబడుతున్నారు.
E Sreedharan is Kerala BJP CM candidate