Saturday, November 23, 2024

ఇ-ఓట్ ప్రయోగం విజయవంతం

- Advertisement -
- Advertisement -

e-Vote Policy Success‌full in Khammam

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి), రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఇటీవల రూపొందించిన ఇఓట్ విధానం పూర్తిస్థాయిలో సక్సెస్‌గా నిలిచింది. దేశంలోనే తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఇంటి నుంచే ఓటు వేసే ఈఓట్ విధానాన్ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇఓట్ విధానంలో ఖమ్మంలో ప్రయోగాత్మకంగా బుధవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యాప్ ద్వారా ఓటింగ్ నిర్వహించారు. 2,128 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 58.6 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇఓటింగ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, రెండు నిమిషాల్లో ఓటింగ్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ క్షేత్రస్థాయిలో ఇఓట్ విధానం అమలు ఎలా జరుగుతుందో గుర్తించేందుకు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇఓట్‌లో పాల్గొనే వారు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇందులో 1520 ఏళ్ల క్రితం దిగిన ఫోటోను కూడా సరిపోల్చగలిగేలా ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. యాప్‌లో వివరాలు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉంటాయి. ఎలా నమోదు చేసుకోవాలి? ఓటు ఎలా వేయాలి? అని తెలుసుకునేలా వీడియోలను అందుబాటులో ఉంచారు. ఈ ఓటింగ్ విధానంలో కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను వినియోగించారు. ఈ సాంకేతికతల సాయంతో 3 సార్లు ఓటరు అథెంటిఫికేషన్ చేయనున్నారు. ఓటరు పేరు, ఆధార్, లైవ్ లోకేషన్, ఇమేజ్ మ్యాచింగ్ వంటివి సరిచూడనున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆన్‌లైన్ ఫార్మేట్‌లో వేసిన ఓట్లు చెరిగిపోకుండా తిరిగి లెక్కించటానికి దోహదపడుతుంది. భద్రతా ప్రమాణాల దృష్టా ఈ డేటా అంతా స్టేట్ డేటా సెంటర్‌లో భద్రపరుస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News