Thursday, January 23, 2025

హిమాన్షు కొత్త సాంగ్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను

- Advertisement -
- Advertisement -
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు మరో కొత్త సాంగ్‌తో అలరించబోతున్నారు. ఈ విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన కొత్త పాటను ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రకటించడం తనకు చాలా సంతోషంగా ఉందని హిమాన్షు పేర్కొన్నారు. ఈ సాంగ్‌ను చూసి మీరందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాని అన్నారు. ఈ ట్వీట్‌ను మంత్రి కెటిఆర్ రీట్వీట్ చేశారు. హిమాన్షు సాంగ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నానని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ పాడిన ‘గోల్డెన్ అవర్’ సాంగ్‌ను కల్వకుంట్ల హిమాన్షు రావు గతంలో అద్భుతంగా ఆలపించిన సంగతి తెలిసిందే. ఈ ఇంగ్లీష్ సాంగ్ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు ఆమోఘం అని నెటిజన్లు కొనియాడారు. అచ్చం జాకబ్ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్ సాంగ్ పాడాడని ప్రశంసించారు. ఈ నెల 24న విడుదల కాబోయే సాంగ్ కూడా ఆ మాదిరిగానే ప్రశంసలు అందుకోవాలని నెటిజన్లు ఆశిస్తున్నారు.

Himanshu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News