Wednesday, January 22, 2025

గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం ‘ఈగల్’

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈనెల 9న ఈగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది.

ఈ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ “ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ రెడ్డి, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్.. అందరూ అద్భుతంగా నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. డేవ్ జాండ్.. రాక్ స్టార్. అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. విశ్వప్రసాద్, వివేక్‌ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటింది. ఈ ప్రొడక్షన్ లో ఎన్ని సినిమాలు చేయడానికైనా సిద్ధమే. అనుపమ పాత్రే ఈ సినిమా కథను నడిపిస్తుంది. కావ్య లవ్లీ క్యారెక్టర్ చేసింది. డైరెక్టర్ కార్తిక్‌కి విపరీతమైన క్లారిటీ వుంది. ఎక్స్‌ట్రార్డినరీగా ఈ సినిమా తీశాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి తనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ “ఈగల్ సినిమా గొప్ప థియేటట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది”అని తెలిపారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ “రవితేజతో ఇలానే చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈగల్… వెరీ స్టయిలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. మంచి సందేశంతో పాటు అద్భుతమైన క్లైమాక్స్ వుంటుంది”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్, దర్శకులు వంశీ కృష్ణ, అనుదీప్, శ్రీరామ్ ఆదిత్య, నటులు నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News