Wednesday, January 22, 2025

రవితేజ ‘ఈగల్’ టీజర్ అదిరిపోయింది…

- Advertisement -
- Advertisement -

ఇటీవల ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీతో అలరించిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఈగల్’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టైటిల్‌ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగ ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. దవ్‌జాంద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈగల్ 2024 సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News