Monday, December 23, 2024

లండన్‌లో ‘ఈగల్’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ ’ధమాకా’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రెండవసారి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఈగల్’ చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సినిమా టైటిల్ గ్లింప్స్ మంచి అంచనాలను నెలకొల్పింది. ’ఈగల్’ కొత్త షెడ్యూల్ సోమవారం నుండి లండన్‌లోప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో రవితేజ, ఇతర ప్రముఖ తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం. కార్తీక్ ఘట్టమనేని రచన , దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు కార్తిక్ స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. దవ్‌జాంద్ సంగీతం సమకూరుస్తున్నారు. ’ఈగల్’ 2024 సంక్రాంతికి విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News