Wednesday, January 22, 2025

‘ఈగల్’తో జనవరి 13న కుమ్మేద్దాం..(ట్రైలర్ లాంచ్)

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండూ రవితేజను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్- ప్యాక్డ్ అవతార్‌లో చూపించాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో లాంచ్ చేశారు. యాక్షన్, డ్రామా, లవ్, ఎమోషన్‌తో ట్రైలర్ ప్యాక్డ్‌గా వుంది.

ఇంతకుముందు విజయవంతమైన కార్తికేయ 2 చిత్రానికి రాసిన మణిబాబు కరణం పవర్‌ఫుల్ డైలాగ్‌లు రాశారు. కార్తీక్ ఘట్టమనేని లార్జర్ దెన్ లైఫ్ కథతో రవితేజను చాలా అద్భుతంగా చూపించారు. టేకింగ్ టాప్ క్లాస్. కార్తీక్ ఈ సినిమా ఎడిటర్, మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. రవితేజ రెండు విభిన్నమైన గెటప్‌లలో వైవిధ్యం చూపించారు. అతను క్లీన్ షేవ్ లుక్‌లో లవర్‌బాయ్‌గా కనిపిస్తుండగా, గడ్డం, పొడవాటి జుట్టుతో వైల్డ్, రగ్గడ్‌గా కనిపించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ “ఈ సినిమాతో కార్తిక్ రూపంలో మరో మంచి దర్శకుడు రాబోతున్నాడు. సినిమా చాలా బావుంటుంది.

తనకి మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. హీరోయిన్స్ కావ్య, అనుపమ చక్కగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్ ప్రొడక్షన్ లాంటింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్‌తో మరొక చిత్రం ప్రారంభించబోతున్నాము. దీనితో కలసి హ్యాట్రిక్ హిట్ అయిపోవాలని కోరుకుంటున్నాను.. ‘ఈగల్’ సినిమాతో జనవరి 13న కుమ్మేద్దాం”అని అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “గత ఏడాది రవితేజతో ‘ధమాకా’ అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాం. ఈ సంక్రాంతికి ‘ఈగల్’తో నెక్స్ బ్లాక్‌బస్టర్‌కి సిద్ధమవుతున్నాము”అని తెలిపారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ ఈగల్ సినిమా పండక్కి గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News