- Advertisement -
చెన్నై: తమిళనాడు, కేరళ తీర ప్రాంతానికి ఉప్పెన పొంచి ఉన్నట్లు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేరళ, తమిళనాడుల తీర ప్రాంతాల్లో మే 4, 5 తేదీల్లో సముద్రం ఉపొంగవచ్చని హెచ్చరికలు చేసింది. సముద్రంలో 0.5 నుంచి 1.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడి తీరాన్ని తాకవచ్చని కూడా ఐఎన్ సిఓఐసి హెచ్చరించింది. ఈ రకమైన ఉప్పెనలను అక్కడ స్థానికంగా ‘కల్ కడల్’ అంటారు.
ఉప్పెనకు సంబంధించిన రెడ్ అలర్ట్ ఐఎన్ సిఓఐసి జారీచేసింది. ముంపుకు గురయ్యే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా హెచ్చరించింది. మత్స్యకారులు, పర్యాటకులు తీరప్రాంతానికి వెళ్లకూడదని హెచ్చరించింది. ఇదిలావుండగా దక్షిణ హిందూ మహా సముద్రంలో బలమైన గాలులు వీచే అవకాంశ ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది.
- Advertisement -