Saturday, November 23, 2024

ఏప్రిల్ 6నుంచి ఎంసెట్ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

Eamcet application from April 6

ఎంసెట్, ఇసెట్ నోటిఫికేషన్ల విడుదల
జులై 14, 15,18,19,20 తేదీల్లో ఎంసెట్, జులై 13న ఇసెట్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంసెట్, ఇసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 14, 15,18, 19, 20 తేదీలలో జరగనున్న ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాల కోసం ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులు రూ.400, ఇతరులు రూ. 800, రెండూ రాసే అభ్యర్థులు రూ.1600 చెల్లించాలి. పాలిటెక్నిక్ డిప్లొమా, బిఎస్‌సి గణితం చదివిన విద్యార్థులు బి.టెక్,బి.ఫార్మసీ రెండో సంవత్సరంలో(లాటరల్ ఎంట్రీ) ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌కు ఏప్రిల్ 6 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్‌సి, ఎస్‌టి,వికలాంగులు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాలని కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ షెడ్యూలు ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

ఎంసెట్ జులై 14 నుంచి 5 రోజులపాటు జరగనుంది. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్‌ను రెండు రాష్ట్రాల్లో 105 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బి.టెక్, బి.ఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు జులై 13న ఇసెట్ పరీక్ష జరుగనుంది.

కనీసం 2.50 లక్షల దరఖాస్తులు..?

ఎంసెట్‌కు రెండు రాష్ట్రాల నుంచి కనీసం రెండున్నర లక్షలమంది దరఖాస్తు చేయనున్నారు. అందులో 90 శాతం వరకు1 తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులే ఉండనున్నారు. గత ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 1,64,962 మంది, అగ్రికల్చర్, ఫార్మసీలకు 86,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి కూడా ఇంటర్ మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ప్రభుత్వం పాస్ చేసింది. ఈ క్రమంలో ఎంసెట్ దరఖాస్తులు గత ఏడాది కంటే భారీగా పెరుగనున్నట్లు తెలుస్తోంది. ఇసెట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 25 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News