ఆలస్య రుసుం లేకుండా
ముగిసిన దరఖాస్తు గడువు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తులు 2.50 లక్షలకు చేరువయ్యాయి. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసింది. మే 28 సాయంత్రం నాటికి ఎంసెట్‌కు మొత్తం 2,49,708 మంది విద్యార్థులు దరఖా స్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎ. గోవర్ధన్ తెలిపారు. ఇందులో ఇంజనీ రింగ్‌కు 1,61,552 అగ్రికల్చర్ విభాగా నికి 88,708 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. 14,15 తేదీలలో అ గ్రికల్చర్ ఎంసెట్ జరుగనుండగా, జులై 18,19,20 తేదీలలో ఇంజనీరింగ్ ఎం సెట్ పరీక్ష జరుగనుంది. గత ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 1,64,962 మంది, అగ్రికల్చర్‌కు 86,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుం తో దరఖాస్తు చేసుకునేందుకు జులై 7 వ రకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో గతే డాది కంటే ఈసారి దరఖాస్తులు పెరుగ నున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఎంసెట్ ద్వారానే
నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2022 – 23) నుంచి ఎంసెట్ ద్వారా బిఎస్‌సి నర్సింగ్ కోర్సుకు ప్రవేశాలు జరగనున్నాయి. ఎంసెట్‌లో బైపిసి విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా, బిఎస్‌సి నర్సింగ్ చేయాలనుకునే విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇంటర్ మార్కుల ఆధారంగా బిఎస్‌సి నర్సింగ్ కోర్సులో ప్రవేశాలను చేపడుతుండగా, తాజా మార్పుతో ఇక నుంచి ఇంజినీరింగ్,ఫార్మసీ, మెడిసిన్ కోరుల తరహాలోనే నర్సింగ్ విద్యలోనూ ఎంసెట్ ర్యాంక్‌ల ద్వారానే సీట్లను భర్తీ చేయనున్నారు.