Monday, December 23, 2024

మూడు లక్షలకు చేరువలో ఎంసెట్ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మూడు లక్షలకు చేరువలో దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం వరకు 2,83,128 దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ బి.డీన్‌కుమార్ తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు గడువు సోమవారం(ఏప్రిల్ 10)తో ముగియనుంది. గత ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి కలిపి 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి దరఖాస్తు ఆలస్యం రుసుం లేకుండానే 2,85,128 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నాటికి ఈ సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉంది. మొత్తం దరఖాస్తుల్లో అగ్రికల్చర్,ఫార్మసీ విభాగానికి 1,01,138 మంది దరఖాస్తు చేసుకోగా, ఇంజనీరింగ్ విభాగానికి 1,81,693 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News