Monday, December 23, 2024

మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఇసెట్, లాసెట్, పిజిఎల్‌సెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పిజిఇసెట్‌కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి. వెంకటరమణతో ప్రవేశ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు.

పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని సూచించారు. మే 7వ తేదీ నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్- ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎడ్‌సెట్‌ను మే 18న, ఇసెట్‌ను మే 20న, లాసెట్(ఎల్‌ఎల్‌బి), పిజిఎల్‌సెట్ మే 25న, మే 26, 27 తేదీలలో ఐసెట్, మే 29 నుంచి జూన్ 1 వరకు పిజిఇసెట్‌ను జరుగనున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి పేర్కొన్నారు.

ప్రవేశ పరీక్షల షెడ్యూల్

టిఎస్ ఎంసెట్(ఇంజనీరింగ్)(జెఎన్‌టియుహెచ్) మే 7 నుంచి 11 వరకు

టిఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్) (జెఎన్‌టియుహెచ్) మే 12 నుంచి 14 వరకు

టిఎస్ ఎడ్‌సెట్(మహాత్మాగాందీ యూనివర్సిటీ) మే 18

టిఎస్ ఇసెట్(ఉస్మానియా యూనివర్సిటీ) మే 20

టిఎస్‌లాసెట్, పిజిఎల్‌సెట్(ఉస్మానియా యూనివర్సిటీ) మే 25

టిఎస్ ఐసెట్(కాకతీయ యూనివర్సిటీ) మే 26,27

టిఎస్ పిజిఇసెట్(జెఎన్‌టియుహెచ్) మే 29,30,జూన్ 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News