Saturday, November 9, 2024

తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు… ఆంధ్రాకు ర్యాంకులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. అగ్రికల్చర్ విభాగంలో ఏడు ర్యాంకులు ఆంధ్రాకు రాగా మూడు ర్యాంకులు తెలంగాణకు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగంలో ఆంధ్రాకు ఎనిమిది ర్యాంకులు, రెండు ర్యాంకులు తెలంగాణకు వచ్చాయి.

అగ్రికల్చర్ విభాగంలో బి జశ్వంత్(తూర్పుగోదావరి)కు ప్రథమ ర్యాంకు, ఎన్. వెంకట్ తేజ(చీరాల)కు ద్వితీయ ర్యాంకు, ఎస్ లక్ష్మి(హైదరాబాద్)కి తృతీయ ర్యాంకు, డి. కార్తికేయ రెడ్డి(తెనాలి)కి నాలుగో ర్యాంకు, వరుణ్ చక్రవర్తి(శ్రీకాకుళం)కి ఐదో ర్యాంకు, గురు శశిధర్ రెడ్డి(హైదరాబాద్)కి ఆరో ర్యాంకు, హర్షిల్ సాయి(నెల్లూరు)కి ఏడో ర్యాంకు, చిద్విలాస రెడ్డి(గుంటూరు)కి ఎనిమిదో ర్యాంకు, గిరి వర్సితకు (అనంతపురం) తొమ్మిదోవ ర్యాంకు, గురు శశిధర్ రెడ్డి(హైదరాబాద్)కి పదో ర్యాంకు సాధించారు.

ఇంజినీరింగ్ విభాగంలో ఎస్ అనిరుధ్(విశాఖ పట్నం)కు ప్రథమ ర్యాంకు, మణిందర్ రెడ్డి(గుంటూరు)కి ద్వితీయ ర్యాంకు, ఉమేష్ వరుణ్(నంది గామ)కు మూడో ర్యాంకు, అభినీత్(హైదరాబాద్‌కు) నాలుగో ర్యాంకు, ప్రమోద్ కుమార్ రెడ్డి(తాడిపత్రికి) ఐదో ర్యాంకు, ధీరజ్ కుమార్(విశాఖకు) ఆరో ర్యాంకు, షన్వితా రెడ్డి(నల్లగొండ)కి ఏడో ర్యాంకు, బి సంజనకి(శ్రీకాకుళం) ఎనిమిదో ర్యాంకు, ఇంజినీరింగ్‌లో ప్రిన్స్ బ్రహ్మంరెడ్డి(నంద్యాలకి) తొమ్మిదోవ ర్యాంకు, ఇంజినీరింగ్‌లో ప్రణతి శ్రీజకి(విజయనగరం) పదో ర్యాంకు సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News