Wednesday, January 22, 2025

ఇఎపి సెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఇఎపి సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇఎపి సెట్ ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఇంజినీరింగ్లో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు ఆంధప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఎస్ జ్యోతిరాదిత్యకు రాగా వరసగా రెండో ర్యాంకు గొల్లలేఖ హర్ష(కర్నూలు-పంచలింగాల), మూడో ర్యాంకు బోగలపల్లి రిషి శేఖర్ శుక్లా(సికింద్రాబాద్-తిరుమలగిరి), ఐదో ర్యాంకు మురసాని సాయి యశ్వంత్ రెడ్డి(కర్నూలు), ఆరో ర్యాంకు పుట్టి కుశల్ కుమార్(అనంతపురం-ఆర్‌కె నగర్), ఏడో ర్యాంకు హుండికర్ విదీత్(హైదరాబాద్-పుస్పాలగూడ), ఎనిమిదో ర్యాంకు రోహన్(హైదరాబాద్-ఎల్లారెడ్డి గూడ), తొమ్మిదో ర్యాంకు కొంతేమ్ మణితేజ(వరంగల్ ఘన్‌పూర్), పదో ర్యాంకు ధనుకొండ శ్రీనిధి(విజయనగరం) వచ్చాయి. ఇంజినీరింగ్‌లో మొదటి రెండు ర్యాంకులు ఎపి విద్యార్థులు సాధించగా తొలి తొమ్మిది ర్యాంకులు బాలుర్లు కైవసం చేసుకున్నారు. టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులకు వచ్చాయి.

అగ్రికల్చర్, పార్మసీలో మొదటి ర్యాంకు ఆలూరు ప్రణీత(మదనపల్లె), రెండో ర్యాంకు నాగుదాసరి రాధాకృష్ణ(విజయనగరం), మూడో ర్యాంకు గడ్డం శ్రీ వర్షిణి(హనుమకొండ), నాలుగో ర్యాంకు సోంపల్లి సాకేత్ రాఘవ్(చిత్తూరు), రేపాల సాయి వివేక్(హైదరాబాద్-ఆసిఫ్‌నగర్), ఆరో ర్యాంకు మహమ్మద్ అజాన్‌సాద్(హైదరాబాద్-నాచారం), ఏడో ర్యాంకు వడ్లపూడి ముఖేష్ చౌదరి(తిరుపతి- వెంగమాంబపురం), ఎనిమిదో ర్యాంకు జెన్నీ భార్గవ్ సుమంత్(హైదరాబాద్-పేట్ బషీరాబాద్), తొమ్మిదో ర్యాంకు జయశెట్టి ఆదిత్య(హైదరాబాద్-అల్విన్ కాలనీ), పదో ర్యాంకు పూల దివ్యతేజ(శ్రీసత్యసాయి జిల్లా-బలిజపేట) ర్యాంకు వచ్చాయి. టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులకు వచ్చాయి.

ఇఎపి సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇఎపి సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇఎపి సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News