Sunday, December 22, 2024

గుండె జబ్బులు త్వరగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: హృద్రోగానికి సంబంధించి ఏర్పడే ఇబ్బందులను సరైన సమయంలో గుర్తించగలిగితే అది ప్రాణాంతకంగా మారకుండా చూసుకోవచ్చని రెనోవా ఆసుపత్రి సిఓఓ డా. రవీంద్రనాథ్ పేర్కొన్నారు. హార్ట్ ఎటాక్ కు సంబంధించి మన శరీరం ఇచ్చే సంకేతాలను సరైన సమయంలో గుర్తించి వెంటనే నిపుణులైన వైద్యులున్న హాస్పిటల్ కు రాగలగితే ప్రాణాన్ని కాపాడవచ్చని చెప్పారు. అయితే ఈ సంకేతాలపై ప్రజలలో అవగాహన లేదని, దానిని కలిపించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు. శుక్రవారం వరల్ హార్ట్ డే పురస్కరించుకొని లంగర్‌హౌజ్ వద్ద నున్న బాపూ ఘాట్ పార్క్ వద్ద నుండి దర్గా వరకూ ఈ వాకధాన్ నిర్వహించారు.

గుండెను కాపాడుకోవడానికి అవసరమైన సూచనలతో కూడిన నినాదాలు, ప్లకార్డులతో వాక్ ధాన్ కొనసాగి ప్రజలను ఆకర్షించింది. గుండెకు సంబంధించిన ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజీని ఆవిష్కరించారు. సుమారు 2 వేలకు పైగా విలువైన గుండెకు సంబంధించిన పరీక్షలు కేవలం రూ. 499లకే ప్యాకేజీ ద్వారా చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పొగాకు సేవనం, ఆల్కహాల్ వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంతగా మన శరీరంలోని అన్ని కీలక అవయవాలతో పాటూ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. దీంతో పాటూ రక్తపోటు లేదా బ్లడ్ ప్రజర్, డయాబెటీస్ లాంటి పలు వ్యాధులున్న వారు నియమిత కాల వ్యవధిలో వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకొని వాటిని అదుపులో ఉంచుకోవాలని సూచించారు. అవి అదుపులో లేక పోతే బయటికి పెద్దగా శరీరంలో సంభవించే మార్పులు తెలియకపోయినా లోలోన శరీరంలోని పలు అవయవాలు అందులోనూ ముఖ్యంగా గుండె పై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. వీటితో పాటూ నిరంతరం వ్యాయామం, మంచి ఆరోగ్య అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలి వంటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో డా. మహమ్మద్ షోయబ్ అహమ్మద్, జహీర్, డా. టి నగేష్, రఘు, సాయి బాబుతో పాటు నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News