Monday, December 23, 2024

తెలంగాణలో అన్ని స్థానాలపై బిజెపి కన్ను

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పారీ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలలో పార్టీని సింసిద్ధం చేయవలసిందిగా పారీ నాయకులను ప్రత్యేకంగా ప్రభారీలను(ఇన్‌చార్జిలు) బిజెపి ఆదేశించింది. నగరంలోని షామీర్‌పేటలో జరుగుతున్న పార్టీ విస్తారక్‌ల(పూర్తికాల కార్యకర్తల) శిక్షణా శిబిరంలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పార్టీ నాయకులు చర్చించారు.

తెలంగాణలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో పార్టీని సింసిద్ధపరచడంతోపాటు నియోజ్కవర్గాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు గడపగడపను సందర్శించాలని పార్టీ నాయులను, కార్యకర్తలను అగ్రనాయకులు ఆదేశించారు. షెడ్యూల్డ్ ప్రకారం 2013 అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్నప్పటికీ ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బిజెపి ఊహిస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులంతా సంసిద్ధంగా ఉండాలని సూచిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు పర్యవేక్షకులను నియమించిన బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంప్రదించి ఆయా నియోజకవర్గాలలో పన్నా ప్రముఖ్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని శిక్షణా శిబిరంలో ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News