Monday, December 23, 2024

ముందస్తు జోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే ఎన్నిక ల్లో హ్యాట్రిక్ సాధించేందుకు భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పావులు కదుపుతోంది. అత్యధిక మె జారిటీతో గెలిచేందుకు హాట్రిక్ సాధించేందుకు కెసిఆరే మా బలం.. బలగం అంటూ అభ్యర్థ్ధులు ఆ నందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే అసెం బ్లీ ఎన్నికల్లో తమకే మళ్లీ అవకాశమివ్వడం తో గె లుపు పట్ల ‘బిఆర్‌ఎస్—-2023’ ఎంఎల్‌ఎ అభ్యర్థు ల్లో గెలుపుధీమా పెరిగింది. టికెట్‌లు దక్కించుకున్న అభ్యర్దులు పుల్‌జోష్‌తో నియోజక వర్గాల్లో సంబురాలు చేసుకుంటున్నారు. సిట్టింగులకే సీట్లిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవడంతో వారు ఉబ్బితబ్బిబ్బవుతూ అ ధినేతను కలసి తమ కృతజ్జతాభివందనాలు తెలుపుకుంటున్నారు.

బిఆర్‌ఎస్ నుంచి మూడోసారి టికెట్ కూడా దక్కించుకున్న అభ్యర్థ్ధుల ఆనందానికి అవధుల్లేవు. దీంతో వారు ప్రగతిభవన్‌కు వ చ్చి కెసిఆర్‌కు ధన్యవాదాల చెబుతున్నారు. ఈ మే రకు పూలబొకేలు శాలువాలతో ప్రగతి భవన్ చే రుకున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆ యా జిల్లాల నేతలతో ప్రగతి భవన్‌లో గత రెండు రోజులుగా సండిగా మారింది. అధినేత కెసిఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటూ, ఫోటోలు ది గుతూ తమ కృతజ్జతలను చాటుకుంటున్నారు. భరోసాను పొందుతున్నారు. అధినేత ఆశీర్వాదం తీసుకుని భారీ మెజారిటీతో రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు తమ నాయకుడిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.

అన్ని పార్టీలకంటే ముందుగా ఒకే సారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం, దేశ ఎన్నికల చరిత్రలోనే రికార్డు గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ సృష్టించిన అరుదైన రికార్డుగా చెబుతున్నారు. కెసిఆర్ ప్రకటించిన జాబితాలో వంద మందికి పైగా సిట్టింగులే కావడం గమనార్హం. కేసీఆర్ లాంటి నాయకుడి మనసు గెలుచుకుని మూడోసారి సిట్టింగ్‌లు టికెట్లు దక్కించుకోవడం మరో రికార్డుగా చెప్పుకోవచ్చు. దేశంలోనే వివిధ సంక్షేమంలో నెంబర్ వన్ గా నిలిచి చరిత్ర సృష్టిస్తున్న కేసీఆర్ మోడల్ పాలనకు మరోసారి ప్రజలు, పట్టం కడతారని భావిస్తున్నారు.ఒకేసారి 115 మంది అభ్యర్దులతో మొద టి జాబితా విడుదల చేసి కెసిఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలో చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News