Monday, December 23, 2024

బల్దియాకు కాసుల వర్షం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎర్లీబర్డ్ పథకకానికీ నగరవాసుల నుంచి విశేష ఆధారణ లభించింది. దీంతో రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ కలెక్షన్లు వచ్చాయి. దీంతో ముందస్తూ వసూళ్లతో బల్దియాకు కాసులు వర్షం కురిసింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీబర్డ్ కింద నెల రోజుల్లోనే 7 లక్షల మంది సుమారు రూ.751 కోట్లు మేర ముందస్తూ ఆస్తి పన్ను చెల్లించారు. ప్రతిఏటా ప్రభుత్వం ముందస్తుగానే ఆస్తి పన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ పథకం కింద 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే..

ఇందులో భాగంగాఈ ఏడాది కూడ ఏఫ్రిల్ 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు నెల రోజుల పాటు ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేవారు. చివరి రోజు ఆదివారం సెలవు దినమైనప్పటికీ నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా ఆప్‌లైన్‌లో సైతం ఆస్తిపన్ను చెల్లించేందుకు జిహెచ్‌ఎంసి అన్ని సర్కిల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలోని పౌర సేవా కేంద్రం(సిఎస్‌సి) వద్ద నగరవాసులు భారులు తీరి మరీ చెల్లించారు. ప్రజల సౌకర్యార్థం సెలవు రోజు సైతం జిహెచ్‌ఎంసి అన్ని పౌర సేవా కేంద్రాలను తెరిచే ఉంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News