Sunday, November 17, 2024

8వ ఖండం వెలుగులోకి

- Advertisement -
- Advertisement -

లండన్ : భౌగోళిక శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితంగా ఇప్పుడు 8వ ఖండం వెలుగులోకి వచ్చింది. ఈ ఖండం 375 సంవత్సరాలుగా ఉనికి ఎక్కడుందో తెలియని స్థితితో దాగి ఉంది. ఇప్పటివరకూ ఏడు ఖండాలు ఉన్నాయనే నిర్థారణ ఉంది. అయితే ఇప్పుడు ఆవిష్కరణలోకి వచ్చిన కొత్త ఖండానికి జియో సైంటిస్టులు జిలాండియా లేదా టె రియూ ఎ యయూయిగా పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఫిజిక్స్ ఆర్గ్ తెలిపింది. అతికొద్ది మంది జియాలజిస్టులు, సిస్మాలాజిస్టులు పరిశోధనలు సాగించారు. జర్నల్ టెక్టోనిక్స్‌లో వీరి అధ్యయనాల ఫలితాలను ప్రచురించారు. సముద్ర ఉపరితలంపై కొట్టుకువచ్చిన రాతి శకలాలను ఆధారంగా చేసుకుని జరిపిన అధ్యయనం ఫలితంగా ఈ ఎనిమిదవ ఖండం ఉనికి తెలిసిందని పేర్కొన్నారు.

ఈ కొత్త ఖండం చిన్నదేం కాదు. భారీ స్థాయిలో ఉంది. 1.89 మిలియన్ చదరపు మైళ్లు (4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణంతో మడగాస్కర్‌తో పోలిస్తే ఆరింతలు ఉంటుంది. ఇప్పుడు ఆవిష్కృతం అయిన కొత్త ఖండం 94 శాతం జలమయం అయి ఉంటుంది. కేవలం కొన్ని దీవులతో ఇది న్యూజిలాండ్‌ను పోలి ఉంటుంది. ఒకప్పుడు ఈ కొత్త ఖండం జలం లేకుండా ఉండి ఉంటుంది. ఏదో ఒక పరిణామంతో జలమయం అయి, దీవులు మిగిలి ఉంటాయని, అయితే ఇప్పటి అధ్యయనం తరువాత ఇక్కవ విస్తరించుకుని ఉన్న ఒకప్పటి పూర్తిస్థాయి ఖండం గురించి తెలిసిందని సైంటిస్టులు వెల్లడించారు. దాదాపు 550 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఖండం ఏర్పాటు అయి ఉంటుందని విశ్లేషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News