Monday, December 23, 2024

23న ఎర్త్ అవర్

- Advertisement -
- Advertisement -

రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయండి
అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్

మన తెలంగాణ / హైదరాబాద్: ఎర్త్ అవర్ లో భాగంగా దేశ వ్యాప్తంగా మార్చి 23న రాత్రి 8.30 – 9.30 వరకు ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఎర్త్ అవర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్త్ అవర్ అనేది గ్రహం ఎదుర్కొంటున్న ట్రిపుల్ సంక్షోభాన్ని గుర్తించేందుకు, వాతావరణ మార్పులు, జీవ-వైవిధ్య నష్టం, పర్యావరణం రక్షించేందుకు ఉపయోగ పడుతుందన్నారు.దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, స్విచ్ ఆఫ్ పవర్ ద్వారా ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ ఉద్యమం వ్యక్తులు, సంస్థలు, వివిధ సంఘాలు అనవసరమైన లైట్లను ఒక గంట పాటు ఆఫ్ చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు.ఈ నెల 23 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంట పాటు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్, దుర్గం చెరువు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ లైబ్రరీ, రాష్ట్రంలోని ఇతర స్మారక చిహ్నాలన్నింటిలో లైట్లు ఆర్పాలని ఆమె కోరారు.

Vaniprasad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News