Sunday, December 22, 2024

ఫిలిప్పీన్స్‌లో భూకంపం: 6.2 తీవ్రత నమోదు

- Advertisement -
- Advertisement -

మనీలా: ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని బటంగాస్ ప్రావిన్సులో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపైన భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. మనీలాకు నైరుతి దిశలో కలటగన్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో 103 కిలోమీటర్ల భూమిలోపల భూకంపం కేంద్రీకృతమైనట్లు ఫిలిప్పీన్స్ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది.

ఉదయం 10.19 గంటలకు భూకంపం సంభవించినట్లు పరిశోధనా కేంద్రం తెలిపింది. భూప్రకంపనలు తీవ్ర నష్టాన్ని చేకూర్చగలవని సంస్థ తెలిపింది. అయితే..ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి వార్తలు రాలేదు. మనీలా కూడా భూప్రకంపనలు కనిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News