లండన్: శుక్రవారం (జులై 29న) భూమి అత్యంత వేగంగా పరిభ్రమించింది. సాధారణంగా భూమి సూర్యుని చుట్టూ 24 గంటల వ్యవధిలో తిరగాల్సి ఉంటుంది. అయితే ఈ రోజున 24 గంటలకు ముందుగానే తిరిగి అతి తక్కువ నిడివి రోజును నమోదు చేసింది. ఈ రోజు భూమి పూర్తి స్థాయిలో కేవలం 1.59 మిల్లీసెకండ్స్ పరిమితిలోనే పరిభ్రమించింది. ఇది ఓ రికార్డు అయింది. ఇటీవలి కాలంలో భూమి ప్రదక్షణ అత్యంత వేగవంతం అవుతున్న విషయాన్ని భూగోళ శాస్త్రజ్ఞులు పసికట్టారు. 1960 నుంచి రికార్డులు పరిశీలిస్తే 2020లో కూడా అత్యంత వేగవంతపు పరిభ్రమణం నమోదు అయింది. తరువాత ఈ ఏడాది జులై 29న ఈ రికార్డు నమోదైంది. గత ఏడాది జులై 19వ తేదీ అత్యంత తక్కువ నిడివి గల రోజుగా ఉంది. భూ పరిభ్రమణ వేగం పెరగడానికి కారణాలు ఇంతవరకూ తెలియలేదు.
అయితే, భూమిలోపలి లేదా వెలుపలి పొరలు, సముద్రాలు, వాతావరణంలోని పలు రకాల మార్పులు ఈ వేగ పరిణామానికి దారితీస్తాయని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. భూ పరిభ్రమణల వేగం క్రమేపీ పెరుగుతూ పోతూ ఉంటే పలు రకాల సాంకేతిక విపరీత పరిణామాలు ఏర్పడుతాయి. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలలో మార్పులు చోటుచేసుకుంటాయని గుర్తించారు. లీప్ సెకండ్ పరిస్థితి కాలమాన క్రమానికి ముప్పు అవుతుంది. గడియారాలు 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల నుంచి 23 గంటల 59 నిమిషాల 60 సెకండ్లు రాకముందే 00:00:00కు జారుకుంటాయి. దీని ప్రభావంతో డాటా స్టోరేజ్‌లో హెచ్చుతగ్గులు పలు సాంకేతిక పరిణామాలకు దారితీస్తాయని విశ్లేషించారు.
Bhoomi roundup Sun with High Speed on July 29th