Sunday, February 23, 2025

టర్కీలో మరో పెను భూకంపం..1300మందికి పైగా మృతి!(వీడియో)

- Advertisement -
- Advertisement -

అంకార: టర్కీని మరో పెను భూకంపం తాకింది. దక్షిణ టర్కీలోని కహ్రామన్‌మారాస్ ప్రాంతంలోని ఎల్బిస్తాన్ జిల్లాలో 7.6 మాగ్నిట్యూడ్ తీవ్రతతో ఈ భూకంపం తాకింది. ఈ తాజా భూకంపం సిరియాలోని డామాస్కస్, లతాకియా ప్రాంతాలను కూడా కుదిపేసింది. ఈ తాజా భూకంపానికి ముందు కూడా 7.8 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది.

సిరియా సరిహద్దులోని గాజియాటెప్ నగరం వద్ద అది సంభవించింది. అనేక భవనాలు ఈ భూకంపాలకు కూలిపోయాయి. దాదాపు 1300 మందికి పైగా మరణించారు. ఇప్పటికీ వందలాది మంది శిథిలాల కింద ఉన్నారు. టర్కీలోని భూకంప బాధితుల సాయం కోసం భారత్ కూడా రెస్కూ, మెడికల్ టీమ్‌లను పంపుతోంది. మరింత తాజా వివరాల కోసం వేచి చూడండి.

Courtesy by AajTak Twitter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News