- Advertisement -
కాబూల్: ఆఫ్ఘానిస్తాన్‌లో రెండు సార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు 4.3గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. శుక్రవారం వేకువజామును 4.51 నిమిషాలకు హిందూకుష్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 17 కిలో మీటర్ల భూమిలోపల ఉందని ఆ దేశపు సిస్మోలజీ పేర్కొంది. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -