Thursday, January 9, 2025

ఎపి, తెలంగాణలో భూకంపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భూమి కంపించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ములుగులో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్ర మేడారంలో ఉందని  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, జగ్గయ్యపేటతో సహా పలు ప్రాంతాలలో భూమి కంపించడంతో జనాలు భయంతో వణికిపోయి బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో భూమి మూడు సెకన్ల పాటు కంపించింది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో పాటు పలు ప్రాంతాలో భూమి ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ప్రజలు తెలిపారు. భూమి కంపించడంతో అపార్ట్‌మెంట్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News