Sunday, January 19, 2025

చైనాలో భారీ భూకంపం

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా ఉందని సిస్మాలజీ అధికారులు వెల్లడించారు. భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి పలు ఇండ్లు కూలిపోయాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్తి నష్టం భారీగా జరిగినట్టు సమాచారం. జిమ్‌జాంగ్ ప్రాంతంలోని అక్సు దికూలో 80 కిలోమీటర్ల లోతులో భూకంప నాభి ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. దీంతో ఢిల్లీలో కూడా స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 14 భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించారు. కజకిస్థాన్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News