- Advertisement -
బీజింగ్ : నైరుతి చైనా లోని సిచువాన్ ప్రావిన్స్‌లో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించి దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8 గా నమోదైందని 16 కిమీ లోతున ప్రకంపన కేంద్రీకృతమైందని చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ వెల్లడించింది. లూడింగ్ కౌంటీకి 39 కిమీ దూరంలో భూకంప ప్రకంపన కేంద్రీకృతమైందని, 5 కిమీ పరిధిలో అనేక గ్రామాలు ఉన్నాయని పేర్కొంది. సిచుయాన్ రాజధాని చెంగ్డులో ప్రకంపనలు విస్తరించాయి. చెంగ్డులో అనేక భవనాలు దెబ్బతిన్నాయి.
- Advertisement -