Thursday, February 20, 2025

ఢిల్లీ, బిహార్, యుపిలో భూకంపం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉత్తర భారత దేశంలో భూకంపం సంభవించింది. సోమవారం వేకువజామున ఢిల్లీ, యుపి, బిహార్ లో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా ఉందని భూపరిశోదన అధికారులు పేర్కొన్నారు. సివాన్‌లోని భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించారు. ఇవాళ తెల్లవారుజామున 5.35 గంటలకు ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్‌తో పాటు బిహార్‌లో 8.02 గంటలకు భూకంపం సంభవించింది. భూప్రకంపనలు చోటుచేసుకున్నప్పుడు భారీ శబ్ధం వచ్చినట్టు ప్రజలు తెలిపారు. అపార్డుమెంట్లు, విద్యుత్ స్తంభాలు ఊగిపోయాయని తెలియజేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియలేదు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News