Thursday, April 3, 2025

గుజరాత్‌లో 4.3 తీవ్రతతో భూకంపం

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో మధ్యాహ్నం 3.21 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ సిస్మోలజీ తెలిపింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.

భూకంపంతో జనం ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 22న ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం నేపాల్‌లో గురించారు. మరో ఫిబ్రవరి మొదటి వారంలో గుజరాత్‌లో భూకంపం సంభవించింది. అమ్రేలి జిల్లాలో ఫిబ్రవరి 4న ఉదయం 7.41 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News