- Advertisement -
జరగని ప్రాణ, ఆస్తి నష్టం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపైన దీని తీవ్రత 5.7గా నమోదైంది. భూకంప తీవ్రతకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఉదయం 9.45 గంటలకు భూమి కంపించగా ఇది అఫ్ఘానిస్తాన్-తజికస్తాన్ సరిహద్దుల్లో కేంద్రీకృతం అయినట్లు అధికారులు చెప్పారు. జమ్మూ కశ్మీరులోని పలు చోట్ల భూమి తీవ్రంగా కంపించినట్లు వారు తెలిపారు. భూకంప పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. భూ ప్రకంపనలకు భయపడిన ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
- Advertisement -