- Advertisement -
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్, ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 సమయంలో కొన్ని సెకండ్లు పాటు భూమి కంపించింది. జమ్ము కశ్మీర్‌ల రాష్ట్రం దోడా లోని గండోహ భేలిషా గ్రామంలో 30 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించామని సిస్మోలజీ శాఖ తెలిపింది. భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్ల పాటు ఏం జరుగుతుందో అర్థం కాలేదని ప్రజలు వాపోయారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి ఇంకా వివరాలు తెలియలేదు.
Also Read: అవినాశ్ రెడ్డికి కస్టోడియాల్ ఇంటరాగేషన్ అవసరమా?: సుప్రీం
- Advertisement -