Monday, December 23, 2024

నేపాల్‌లో మళ్లీ భూకంపం

- Advertisement -
- Advertisement -

ఖాట్మండూ: ఢిల్లీ హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిసునాయి. తాజాగా అక్కడ మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సోమవారం సాయంత్రం 4:16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి జాజర్‌కోట్ ఏరియా వణికిపోయింది. ఇప్పటటికే అక్కడ వచ్చని రెండు భూకంపాల కారణంగా ప్రజలు నిరాశ్రయులయారు.

మరోవైపు భారత్‌లోని ఢిల్లీలోనూ బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కార్యాలయాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మూడు రోజుల్లో ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండో సారి. వరుస భూకంపాలతో ఢిల్లీ దాని పరిసర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News