Thursday, January 23, 2025

భారీ భూకంపం..12మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లను మంగళవారం భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోగా ఇరుదేశాల్లో గాయపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. అఫ్గానిస్థాన్‌లోని హిందుకుష్ ప్రాంతంలో సంభవించిన భూకంపం భూఉపరితలానికి 180కిలోమీటర్లు లోతులో ఏర్పడిందని పాక్ వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు ఉత్తర భారతంలో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహత్, లక్కీ మర్వత్, గుజ్రాన్‌వాలా, గుజరాత్, సియాల్‌కోట్, కోట్ మోమిన్, చక్వాల్ తదితర ప్రాంతాల్లో భూకంప ప్రభావం పడింది.

పెషావర్‌లోనిప్రొవిన్సియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథార్టీ (పిడిఎంఎ) మరణించారని ట్వీట్‌లో తెలిపింది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని ట్వీట్‌లో పేర్కొంది. అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో వీరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లో ఓ వ్యక్తి, 13ఏళ్ల బాలిక అనంతరం భయాందోళనలకుగురై గుండెపోటుతో మృతిచెందినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది. స్వాత్‌లో 160మందికిపైగా గాయపడ్డారు. ఆసుపత్రులు అత్యవసర పరిస్థితి ప్రకటించాయి. భూకంపం గిల్టిట్‌బాలిస్థాన్ (జిబి) ప్రాంతాన్ని కుదిపేసింది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని షాబాజ్ షరీఫ్ విపత్తు నిర్వహణ అధికారులను కోరారు.

అఫ్గాన్ ప్రజారోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం భూకంపం కారణంగా ముగ్గురు మరణించగా గాయపడ్డారు. అంతర్జాతీయ భూకంప కేంద్రం నివేదిక ప్రకారం పాకిస్థాన్, భారత్, తుర్క్‌మెనిస్థాన్, కజకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, కిర్గిజ్‌స్థాన్‌ల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. కాగా ఈ ఏడాది జనవరిలో ఇస్లామాబాద్‌లో 6.3తీవ్రతతో భూకంపం సంభవించింది. 2005లో పాక్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News