- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలుచోట్ల స్వల్ప భూకంపం సంభవించింది. రెండు మండలాల్లోని మారెళ్ల, తాళ్లూరు, రామభద్రాపురం, శంకరాపురం, పోలవరం, గంగవరం, ముండ్లమూరు, వేంపాడు, తూర్పుకంభంపాడు, పసుపుగల్లుతో పాటు పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.
- Advertisement -