Wednesday, January 22, 2025

శ్రీలంకలో భూకంపం

- Advertisement -
- Advertisement -

కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. భూకంపతీవ్రత రిక్టరు స్కేలుపై 6.2 గా నమోదైంది. భూ ప్రకంపనల తీవ్రతకు కొన్ని చోట్ల గోడలకు పగుళ్లు ఏర్పడినట్టు అక్కడి మీడియా గుర్తించింది. కొలంబోకి ఆగ్నేయ దిశగా 1326 కిమీ దూరంలో 10 కిమీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఆస్తి, ప్రాణనష్టం గురించి వివరాలేమీ బయటకు రాలేదు. ఈ భూకంపం వల్ల శ్రీలంకకు పెద్దగా నష్టం లేదని అమెరికా జియోలాజికల్ సర్వే అండ్ మైన్స్ బ్యూరో పేర్కొంది.

లద్దాఖ్‌లో 4.4 తీవ్రతతో …
మరోవైపు భారత్ లోని లద్దాఖ్ లోనూ భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 1.08 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. కార్గిల్‌కు వాయువ్య దిశలో 314 కిమీ దూరం, 20 కిమీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News