- Advertisement -
రబాత్: మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన తీవ్ర భూకంపం 296 మంది ప్రజలను బలిగొన్నట్లు దేశ హోంమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. నేలమట్టమైన భవనాలు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన చారిత్రాత్మక మర్రాకెక్ నగరం చుట్టూ నిర్మించిన పురాతన ఎర్ర గోడలు కూలిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలను మొరాకో ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నగరంలోని రెస్టారెంట్ల నుంచి రోడిస్తూ పరుగులు తీస్తున్న పర్యాటకుల వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. రాత్రి 11.11 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే మొరాకో జాతీయ భూకంప పరిశీలనా కేంద్రం మాత్రం భూకంపం తీవ్రతను 7గా ప్రకటించింది.
- Advertisement -