Tuesday, November 5, 2024

గుజరాత్‌లోని కచ్‌లో 3.2 తీవ్రతతో భూకంపం!

- Advertisement -
- Advertisement -

కచ్: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో సోమవారం ఉదయం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్(ఐఎస్‌ఆర్) తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలింటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. కచ్‌లో తేలికపాటి భూప్రకంపనలు సంభవించడం ఓ సాధారణ విషయం. భూప్రకంపన ఉదయం 7.35 గంటలకు నమోదయింది. దాని భూకంప కేంద్రం కచ్ జిల్లాలోని భచౌ నగరానికి 10 కిమీ. ఉత్తరఈశాన్య(ఎన్‌ఎన్‌ఈ) దూరంలో నమోదయినట్లు ఐఎస్‌ఆర్ తెలిపింది.

చాలా ప్రమాదకర భూకంప జోన్‌లో ఉన్న కచ్ జిల్లాలో 2001లో సంభవించిన భూకంపం కారణంగా 13800కు పైగా ప్రాణాలు కోల్పోయారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు. నాటి భూకంపం గత రెండు శతాబ్దాలుగా దేశంలో సంభవించిన మూడో అతిపెద్ద, రెండో అత్యంత విధ్వంసకర భూకంపం అని చెప్పాలి. గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(జిఎస్‌డిఎంఎ) ప్రకారం గుజరాత్ అధిక భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.  1819,1845,1847,1848,1864,1903,1938,1956,2001లో పెద్ద భూకంపాలనే గుజరాత్ చూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News